Monday, February 16, 2009

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మెండైన సొగసరి

ముగ్దమనోహరమైన మోముపై మందహాసం ఆమె సిరి
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మెండైన సొగసరి
తేనె పలుకులతో ప్రేమామృతం కురిపించే సదా మాధురి
అన్ని అర్హతలున్న నా ప్రేమ సామ్రాజ్యపు మదుపరి
ఇదంతా ఆమెతోనే చెప్పాలనుకున్నాను సరాసరి
చూడాలి ఏ సమాదానమిస్తుందో ఆ గడసరి

ప్రేమను వ్యక్తపరచడంలో చేయకు జాప్యం

ప్రేమను వ్యక్తపరచడంలో చేయకు జాప్యం
ఎందుకంటే ప్రేమించడం కాదు పాపం
ప్రేమించబడటం ఎప్పుడూ మన భాగ్యం
అంతేకాని ప్రేమించబడకపోవటం కాదు శాపం
ప్రేమించలేకపోవడం ఒక రోగం
అది నువ్వు ఆశిస్తున్న వ్యక్తిలోని లోపం
ఈ చిన్న కారణానికి నీ జీవితం కాకూడదు అంతం

Sunday, January 4, 2009

నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది

నీతో నన్ను ఊహించుకుంటూ నా మది మురిసిపోయింది
నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
ఆ అభిమానానికి అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై కరిగిపోయింది
తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
నీకోసం ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
కాని నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది

Tuesday, December 30, 2008

నూతనసంవత్సర శుభాకాంక్షలు

దేశాభివృద్దికి కొలమానంగా తలచే షేర్ మార్కెట్ పరుగులు తీస్తూ
ప్రపంచ ఆర్దికమాంద్యంతో జడిసి అదే మార్కెట్ కుదేలవుతూ
కలగా మిగిలిన ఒలింపిక్స్ పతకాల సాదనతో మురిసిపోతూ
సమాచార సాంకేతిక కొలువులు హారతి కర్పూరంలా తరిగిపోతూ
సాద్యమా అనుకున్న చాంద్రాయన్ ప్రయోగపు విజయాలతో వెలిగిపోతూ
ఉగ్రవాదుల క్రూర అరాచకాలతో వేలప్రాణాలు బలైపోతూ
ఇలా కష్టసుఖాల మిలితమైన ఈ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ
కొత్త సంవత్సరం అందరికి సంతోషాల హరివిల్లై సాగిపోవాలని తలస్తూ
హృదయపూర్వక నూతనసంవత్సర శుభాకాంక్షలు

Wednesday, December 10, 2008

నిను చూడగనే సంబరం

నిను చూడగనే సంబరం
తో మునిగింది హృదయమందిరం.
నీ సొగసు అంటింది అంబరం.
అది చూసి
జడత్వంతో నిలిచిపోయింది నా శరీరం.
తీరింది నిను చూడలేనేమోనన్న కలవరం .

Thursday, December 4, 2008

ముష్కరుల ఆటకట్టించిన వీర జవాను వందనం.

పదిమందిని మట్టు పెట్టినందుకు మనదా విజయం,
లేక పదనలుగురిని పట్టుకోనందుకు వారిదా విజయం.
అని అనుకోవడానికి కూడా లేదు మనకు దైర్యం.
చేసిన తప్పులనుంచి పాఠం నేర్చుకోకపోవడం మన నైజం.
అంతా మనమెన్నుకున్న పాలకులలోనే ఉంది లోపం.
ఏది ఏమైనా

ముష్కరుల ఆటకట్టించిన వీర జవాను వందనం.
ఈపాపం లో ఏమాత్రము లేదు నీకు భాగం.

Monday, October 27, 2008

మరువలేని మదురమైన జ్ఞాపకం

కలిగింది పరిమళమైన మనస్సుతో స్వచ్చమైన స్నేహం,
సాగుతోంది తీయని మాటల ప్రవాహంలో చేరుకోవాలని తీరం,
ఆశపడ్డాను ఆ స్నేహమే కావాలని విడదీయలేని పాశం,
వెలువరించాను నీతో కలసి
అడుగువేయాలనుకుంటున్నాననే నిజం,
అంతలోనే అనుకోలేదు జాతకమై ఎదురవుతుందని అవరోధం,
ఊహించలేదు పుట్టుకే అవుతుందని శాపం,
ఆ పరిణామంతో కలిగింది తీవ్రమైన మనస్థాపం,
వెక్కి వెక్కి ఏడవడానికి
కాదు మరి ఇది అనువైన ప్రాయం,
మరిచిపోదామంటే మరువలేని మదురమైన జ్ఞాపకం,
ఆ క్షణంలో విదిని ఎదిరించాలని తీవ్రమైన కోపం,
కాని తెలుసు విదిరాతను ఎదిరించాలనుకోవడం అవివేకం,
ఆలోచిస్తే కాదనిపించింది ఎవరిదీ నేరం,
కాలంతోపాటు కోలుకుంటోంది గాయపడిన హృదయం,
ఎవరి సానుభూతికోసం చెబుతున్న మాటకాదిది, సత్యం.
కాని సదా నా మది కోరుకుంటోంది
ఆమెతో విలువైన స్నేహం మరియు ఆమె క్షేమం.