Monday, September 29, 2008

వాలుకనులదానా ఇటువేపు చూడు మైనా

వాలుకనులదానా ఇటువేపు చూడు మైనా
నీ కోసమే నేనున్నా, నీ రూపమే ఊహిస్తున్నా
అంత శక్తి నాకు లేదనుకున్న, ఐనా నిలువలేకపోతున్న
నీ వడిలో సేదతీరాలని ఉన్నా, నా ఆశ తీరదే ఎంతసేపైనా
విసుగుపడక నిలుచున్న ఎంత ఆలస్యమైనా
నా మీద నీకు ఇంత చిన్నచూపుఎందుకనుకున్న.
నీ మీద నాకున్న ప్రేమ ఎంతైనా
నీ అనుగ్రహం లేకున్న నా బ్రతుకు సున్న

Friday, September 26, 2008

పిడుగువై దద్దరిల్లు

పిడుగువై దద్దరిల్లు
మెరుపువై మారుమ్రోగు
నిప్పువై తగలబెట్టు
నీరువై తుడిచిపెట్టు
సమాజ జీవచ్చవాన్ని
సింహమై పంజావిప్పు
వడిసి పట్టి దెబ్బకొట్టు
మెడఫై తల ఎగిరేటట్టు
లంచగొండి డొక్క చీల్చు
పళ్ళు కొరికి చాచి కొట్టు
32 పళ్ళు ఊడేటట్టు

నాలో ఉన్నది నీవేనా

నాలో ఉన్నది నీవేనా
మన ఇద్దరిది ప్రేమేనా
దీనికి కర్తవు నీవేనా
నా ఎదురుగ దేవత నీవేనా
నీ పూజకి పుష్పం నేనేనా
నా కన్నుల కాంతివి నీవేనా
నీ మేనుకు శిల్పిని నేనేనా
నే కనగల స్వర్గం నీవేనా
ఆ స్వర్గపు దాసుని నేనేనా
ప్రేమకు అర్థం నీవేనా
నీ ప్రేమలొ ఉన్నది నేనేనా
నా మదిలో ఊహవు నీవేనా
ఆ ఊహకు ప్రాణం నేనేనా
దీనంతటికి కారణం కలయేనా
ఆ కలగన్నది నేనేనా

Thursday, September 25, 2008

ప్రక్రుతి లాంటి నీ అందాన్ని కననివ్వు

ప్రక్రుతి లాంటి నీ అందాన్ని కననివ్వు
సంగీతంలాంటి నీ గానాన్ని విననివ్వు
నీ మీదనే నా ప్రేమ అనే మాటపై నిలువనివ్వు
నా గుండెపై నీ తీపి ముద్ర పడనివ్వు
నా ప్రేమనంగీకరించి నన్ను బ్రతకనివ్వు

Wednesday, September 24, 2008

పెనుముఫై చిట్లుతున్ననీటిని చూసి నేర్చుకో పౌరుషం

పెనుముఫై చిట్లుతున్ననీటిని చూసి నేర్చుకో పౌరుషం
రోజా చెట్టుఫై వికసిస్తున్న పువ్వుని చూసి నేర్చుకో రాజసం
బాగా కాయలున్నచెట్టు కొమ్మని చూసి నేర్చుకో వినయం
వెలుగుతూ కరిగిపోతున్న క్రొవత్తిని చూసి నేర్చుకో త్యాగం
సస్యశామలమైన ఫైరుని చూసి నేర్చుకో శాంతం

ప్రియా నమ్మవా నీ మీద నాకున్న ఆపేక్ష

ప్రియా నమ్మవా నీ మీద నాకున్న ఆపేక్ష
ఎందుకు నా మీద నీకంత కక్ష
ఇంకెంత కాలం ఈ పరీక్ష
నిన్నునమ్మించలేక పోయిందే నా దీక్ష
నేనడిగింది కేవలం నీ ప్రేమ బిక్ష
ఇక నాకు లేదు ఉపేక్ష
నీవు కాదంటే నాకు మరణశిక్ష

కమలం విరిసింది నీ స్పర్సతో

కమలం విరిసింది నీ స్పర్సతో
అదరం వణికింది నీ పిలుపుతొ
నయనం అదిరింది నీ చూపుతో
వదనం వెలిగింది నీ రాకతో
మదురం నా ఊహ నీ కలతో

Tuesday, September 23, 2008

అందమైన కలలన్నీ నిజమైతే

అందమైన కలలన్నీ నిజమైతే
కనడానికి కలలు ఇంక మిగిలి ఉండునా
కమ్మనైన ఊహలన్ని మేడలైతే
మేడలోన ఊహకింక చోటు ఉండునా
ఆశయాల్ని లక్ష్యాన్ని మరచిపోతే
నీ జీవితానికింక అర్థం ఉండునా
సత్యాన్ని తెలుసుకొని కష్టపడితే
నిరాశకు , నిస్ప్రుహలకింక తావు ఉండునా

నా మది నిండా నీ ఊహలే

నా మది నిండా నీ ఊహలే
నా ఊహలనిండా నీ కాంతులే
ఆ కాంతులనిండా నా ఆశలే
నా ఆశలనిండా నా శ్వాసలే
నా శ్వాసలనిండా నీ చూపులే
ఆ చూపులనిండా సందేహాలే
నీవే నన్ను నమ్మకపొతే
నా బ్రతుకు చెదులే

స్నేహంలోని మానవత్వం కొండంత

స్నేహంలోని మానవత్వం కొండంత
స్నేహం యొక్క హృదయం లోతుసముద్రమంత
స్నేహంలోని మాదుర్యం అమ్మ మనసంత
స్నేహంలోని జాలిగుణం చెప్పలేనంత
స్నేహంలోని స్వార్థం అణువంత
నా స్నేహితునిలోని ఈ గుణాలన్నిటి ముందు,
అసలు ఈఫిల్ టవర్ ఎత్చెంత
స్నేహం గూర్చి నిర్వచించడానికి
నా అర్హత కొంత

స్పందనలేని ప్రతిస్పందన కోసం ఎదురుచూడడం వ్యర్థం

ఆకాశంలోని ఇంద్రదనస్సుని తాకాలనుకోవడం
ఉరిమె మెరుపుని చల్లార్చాలనుకోవడం
మచ్చలేని చందమామను చూడాలనుకోవడం
స్పందించే మనసును దూరం చేసుకొని

స్పందనలేని ప్రతిస్పందనకోసం,ఎదురుచూడడం వ్యర్థం

ప్రేమించడం కాదు నేరం

ప్రేమించడం కాదు నేరం
చెలి మనస్సు గెలవడంలోనే ఉంది మధురం
ప్రియురాలు ఎలాగైన
సొంతం కావాలనుకోవడం స్వార్థం
నీ ప్రేమ సఫలమైతె నీ బ్రతుకు సార్ధకం
అదే విఫలమైతె అనుకోకు నీ జీవితం వ్యర్థం
ఇంకా జీవితంలో సాదించాల్సింది అపారం

జగజ్జీవికి అనివార్యం స్నేహం

గుండెలోని విషాద ప్రళయాన్ని
చీమంత చేసేది స్నేహం
హృదయాంతరాలలోని అల్పానందాన్ని
అధికానందం చేసేది స్నేహం
కల్మషమైన కుల మత భేదాన్ని

కూలద్రోసేది స్నేహం
అనుచితమైన ప్రాంతీయ భేదాన్ని

పారదోలేది స్నేహం
కనుకనే జగజ్జీవికి అనివార్యం స్నేహం

త్యాగానికి మారు పేరు, మరో పేరు అమ్మ

సహనానికి ప్రతిరూపం అమ్మ
అందుకేనేమో బరువైన భూబారాన్ని భూమాతకు అప్పగించాడు ఆ దేవుడు
సాహసానికి స్వరూపం అమ్మ

అందుకేనేమో తీవ్రమైన ప్రసవవేదనను తల్లికే మిగిల్చాడు ఆ దేవుడు
మానవత్వానికి మలిరూపం అమ్మ

అందుకేనేమో ప్రతి బిడ్డను తన బిడ్డలాగే భావిస్తుంది ప్రతి తల్లి
వెర్రివాత్సల్యానికి వేరే రూపం అమ్మ

అందుకేనేమో పాపం తలకొరివి పెట్టె అవకాసం కూడా తన బిడ్డకే ఇవ్వమంటుంది
అందుకె త్యాగానికి మారు పేరు, మరో పేరు అమ్మ


ఎగిరే ఎగిరే మువ్వన్నెల జెండా

ఎగిరే ఎగిరే మువ్వన్నెల జెండా
అలసిపోని నీ రెప రెపలే మా ప్రగతికి అండ
తల ఎత్తుకు నిలిచే నిను చూసి

గర్వంతో పొంగిపోతుంది హృదయం నిండా
నీ ప్రతిష్ఠకు వన్నెతెచ్చిన త్యాగమూర్తులందరికి

మా కన్నీటి కుసుమాల దండ
అందుకే మేమంతా నడుచుకోవాలి
నీ ప్రతిష్టకు భంగం కలుగకుండా

వీడ్కోలు

కల కాదు నేస్తం విడిపోతున్నాం మనం.
నమ్మలేక పోయిన ఇది నిజం.
విద్యార్థి జీవితానికి ఇది అరుదైన శాపం.
ఎందుకో ఊహించ లేక పోతున్నాను ఈ దూరం.
బాధపడకు మిత్రమా బోలెడు జ్ఞాపకాలు మన సొంతం.
బౌతికంగా కావొచ్చు మన మధ్య దూరం అనంతం,
కాని మానసికంగా అది అతి స్వల్పం.
జీవిత సత్యాన్ని తెలుసుకొని సాగించు నీ పయనం.
చివరిగా నాది మీది వేసే ప్రతి అడుగు కావాలి విజయం.

బోసి నవ్వుల పాపలు


బోసి నవ్వుల పాపలు
ఆపకండి మీ నవ్వులు
ప్రతిభకు వేయకండి బ్రేకులు
ఆడండి బాగా ఆటలు
ముడుచుకు కూర్చోకండి చేతులు
రానున్నవి మీ రోజులు
వినండి పెద్దల మాటలు
వేయండి ప్రగతికి బాటలు