Monday, October 27, 2008

మరువలేని మదురమైన జ్ఞాపకం

కలిగింది పరిమళమైన మనస్సుతో స్వచ్చమైన స్నేహం,
సాగుతోంది తీయని మాటల ప్రవాహంలో చేరుకోవాలని తీరం,
ఆశపడ్డాను ఆ స్నేహమే కావాలని విడదీయలేని పాశం,
వెలువరించాను నీతో కలసి
అడుగువేయాలనుకుంటున్నాననే నిజం,
అంతలోనే అనుకోలేదు జాతకమై ఎదురవుతుందని అవరోధం,
ఊహించలేదు పుట్టుకే అవుతుందని శాపం,
ఆ పరిణామంతో కలిగింది తీవ్రమైన మనస్థాపం,
వెక్కి వెక్కి ఏడవడానికి
కాదు మరి ఇది అనువైన ప్రాయం,
మరిచిపోదామంటే మరువలేని మదురమైన జ్ఞాపకం,
ఆ క్షణంలో విదిని ఎదిరించాలని తీవ్రమైన కోపం,
కాని తెలుసు విదిరాతను ఎదిరించాలనుకోవడం అవివేకం,
ఆలోచిస్తే కాదనిపించింది ఎవరిదీ నేరం,
కాలంతోపాటు కోలుకుంటోంది గాయపడిన హృదయం,
ఎవరి సానుభూతికోసం చెబుతున్న మాటకాదిది, సత్యం.
కాని సదా నా మది కోరుకుంటోంది
ఆమెతో విలువైన స్నేహం మరియు ఆమె క్షేమం.

5 comments:

Thrivikram said...

Excellant sai,neeku bhavishyattulo chala future vundi kaviga

Anonymous said...

This is also a good one mama..
Second line ఇ౦కా మ౦చిగా రాయి.

bloggerbharathi said...

మీరు బాగా వ్రాస్తున్నారు .
కానీ మీ టెంప్లేట్ బాగా ముదురు రంగులో ఉండడం వల్ల
కళ్ళకి అలసటగా ఉంది.

Raji said...

చాలా బాగా వ్రాస్తున్నారు సాయి గారు.. keep going!!

Anonymous said...

dear sir,

your lines says the pain you felt, the strong feeling for her.
i am falling short of words to apperciate you. so i can only pat on your shoulder and express that it shows your heart.