Sunday, January 4, 2009

నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది

నీతో నన్ను ఊహించుకుంటూ నా మది మురిసిపోయింది
నీ అభిమానానికి నా హృదయం పొంగిపోయింది
ఆ అభిమానానికి అర్థం తెలిసి నా గుండె ఆగిపోయింది
నీతో చెప్పాలనుకున్న మాట నా పెదాలపై కరిగిపోయింది
తీగ తెగిన వీణలా నా గొంతు మూగబోయింది
నీకోసం ప్రాకులాటలో నా మనసు అలసిపోయింది
ఏంటో ఇదంతా కలలా జరిగిపోయింది
కాని నీకు తెలియదు, నా ప్రాణం నీ దగ్గర ఉండిపోయింది

3 comments:

Unknown said...

సాయిరాం గారు బ్లాగు ప్రపంచానికి స్వాగతం.

Raji said...

సాయి గారు,
చాలా బాగా రాసారండి..

Unknown said...

మీ బ్లాగు బాగుంది..మీ బ్లాగును నెల్లూరు బ్లాగుల సముదాయం నకు కలపటం జరిగింది..please once look at www.nelloreblogs.blogspot thank you..