Monday, October 27, 2008

మరువలేని మదురమైన జ్ఞాపకం

కలిగింది పరిమళమైన మనస్సుతో స్వచ్చమైన స్నేహం,
సాగుతోంది తీయని మాటల ప్రవాహంలో చేరుకోవాలని తీరం,
ఆశపడ్డాను ఆ స్నేహమే కావాలని విడదీయలేని పాశం,
వెలువరించాను నీతో కలసి
అడుగువేయాలనుకుంటున్నాననే నిజం,
అంతలోనే అనుకోలేదు జాతకమై ఎదురవుతుందని అవరోధం,
ఊహించలేదు పుట్టుకే అవుతుందని శాపం,
ఆ పరిణామంతో కలిగింది తీవ్రమైన మనస్థాపం,
వెక్కి వెక్కి ఏడవడానికి
కాదు మరి ఇది అనువైన ప్రాయం,
మరిచిపోదామంటే మరువలేని మదురమైన జ్ఞాపకం,
ఆ క్షణంలో విదిని ఎదిరించాలని తీవ్రమైన కోపం,
కాని తెలుసు విదిరాతను ఎదిరించాలనుకోవడం అవివేకం,
ఆలోచిస్తే కాదనిపించింది ఎవరిదీ నేరం,
కాలంతోపాటు కోలుకుంటోంది గాయపడిన హృదయం,
ఎవరి సానుభూతికోసం చెబుతున్న మాటకాదిది, సత్యం.
కాని సదా నా మది కోరుకుంటోంది
ఆమెతో విలువైన స్నేహం మరియు ఆమె క్షేమం.

Wednesday, October 8, 2008

కమ్మని కాంతుల కలయిక

కమ్మని కాంతుల కలయిక
తియ్యని వలపుల అమరిక
నా మది కోరే నీతో స్నేహమిక
అనుమతించనిచో నే లేనిక

Tuesday, October 7, 2008

తప్పుని ఎత్తి చూపు కాలరౌద్రమై

తప్పుని ఎత్తి చూపు కాలరౌద్రమై
నలుగురికి వెలుగుచూపు మెరుపు మేఘమై
అందరికి కనిపించు పారదర్సకమై
ఆచరణలో పెట్టు నిత్యం సత్యమై
ఎప్పటికి నిలిచిపో స్వాతి ముత్యమై

వెన్నెల్లో నడిచే మబ్బులు

వెన్నెల్లో నడిచే మబ్బులు
వర్షంలో తడిసే సంద్రం
ఎండలో వెంటాడే నీడ
ఆనందంగా ఉన్నప్పుడు సంతోషం
దుఖంలో ఉన్నప్పుడు కన్నీరు
విడ్డూరమైతే
నీ మీద నాకున్న ప్రేమ కూడా విడ్డూరమే

Monday, October 6, 2008

నీ అడుగు వెనక అడుగు వేయాలన్నది

నీ అడుగు వెనక అడుగు వేయాలన్నది
నా కాలు నువ్వునడువగా
నీతో శ్రుతి కలపాలన్నది
నా గొంతు నువ్వు పాడగా
నాకు తెలియకనే
నాపెదవులపై చిరునవ్వు నువ్వు నవ్వగా
మోక్షము కలిగినంత
తృప్తి కలిగెను నాకు నిను చేరగా
ఈర్ష కలిగెను నాకు నీ అందం చూడగా.